బాలకృష్ణ – అనిల్ రావిపూడి మూవీ అప్డేట్

అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 మూవీ వీర సింహారెడ్డి చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతుంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే తన 108 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వరుస హిట్ల తో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలకృష్ణ తన 108 మూవీ చేయబోతున్నాడు.

ఈ మూవీ కి సంబదించిన తాజా అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో సంబరాలు నింపారు మేకర్స్. ఈ మూవీ షూటింగ్‌ డిసెంబర్‌ 8న హైదరాబాద్‌లో షురూ కాబోతుంది. మేకర్స్ ఈ మూవీ కోసం స్పెషల్ జైలు సెట్‌ వేస్తున్నారని ఇన్‌ సైడ్‌ టాక్‌. ఫ్లాష్‌ బ్యాక్‌ జైలు ఎపిసోడ్‌ కోసం ఈ సెట్టు వేస్తున్నట్టు సమాచారం. బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో చూపించేందుకు రెడీ అవుతున్నాడట అనిల్ రావిపూడి. పెళ్లి సందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటించనున్నట్టు ఇప్పటివరకున్న సమాచారం.