మూడు రోజుల పాటు నెక్లెస్ రోడ్డు వైపు ట్రాఫిక్ ఆంక్షలు

మూడు రోజుల పాటు నెక్లెస్ రోడ్డు వైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు…శుక్రవారం (డిసెంబర్ 9) నుంచి డిసెంబర్ 10, 11 తేదీల్లో నగరంలో మరోమారు ‘ఇండియన్ రేసింగ్’ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. 9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 11న రేసింగ్ ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

ఈ రేసింగ్ పోటీలకు సన్నాహకంగా గత నెల 19, 20వ తేదీల్లో ఇండియన్ రేసింగ్ తలపెట్టారు. అయితే, రేసింగ్ కొనసాగుతుండగా.. ట్రాక్‌పై చెట్టు కొమ్మ విరిగిపడటం, మలుపుల వద్ద లోపాలు తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రేసింగ్ ఈవెంట్‌ను అర్ధంతరంగా మధ్యలోనే వాయిదా వేశారు. అప్పుడు ఈ షోకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వెనక్కి ఇచ్చింది ఇండియన్ రేస్ లీగ్. అనంతరం దిద్దుబాటు చర్యలు చేపట్టి తిరిగి ‘ఇండియన్ రేసింగ్’ నిర్వహిస్తున్నారు.