ఖమ్మం లో ‘సంక‌ల్ప స‌భ’కు ముందడుగు: హైదరాబాద్ నుంచి బయలు దేరిన షర్మిల

ఇవాళ సాయంత్రం కొత్త పార్టీ ప్రకటన

Anil Kumar with wife Sharmila
Anil Kumar with wife Sharmila

Hyderabad: దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె వైఎస్ ష‌ర్మిల తెలంగాణలో కొత్త పార్టీకి నేడు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. తన పార్టీ పరిచయ వేదిక‌గా ఆమె ఖ‌మ్మం ను ఎంచుకుని భారీ బహిరంగ సభలో కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారు. ‘సంక‌ల్ప స‌భ’ పేరుతో ఖ‌మ్మంలో ఈరోజు సాయంత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇప్పటికే హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ నుంచి కాన్వాయ్ తో ఆమె ఖమ్మంకు బయలుదేరారు. తొలుత భ‌ర్త అనిల్ ఆశీస్సులు ఆమె తీసుకున్నారు..

ఇదిలావుండగా, త‌న భార్య కొత్త ప్ర‌యాణం విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ అనిల్ భార్య ష‌ర్మిల‌తో క‌ల‌సి ఉన్న ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.. వైఎస్‌ మరణానంతరం 2013లో ఓదార్పుయాత్ర చేసిన షర్మిల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేశారు. అనంతరం రాజకీయంగా స్తబ్దుగా ఉన్న ఆమె..2021 ఫిబ్రవరి 9న ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తెలంగాణ జిల్లాల నేతలు, అభిమానులతో సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/