పవన్ కు సమస్యలపై అవగాహన లేదంటూ మంత్రి రోజా ఎద్దేవా

roja satire to pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి రోజా. పవన్ కళ్యాణ్ కు ప్రజల సమస్యల ఫై అవగాహన లేదంటూ ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు సీఎం జగన్ ఫై విషం చిమ్మి అధికారంలోకి రావాలని ట్రై చేస్తున్నారని , ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు మరోటి ఉండవని రోజా అన్నారు.

పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని , ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసిన ఘనత చంద్రబాబుదని, పవన్ కల్యాణ్ ను కూడా అలాగే వాడుకుని వదిలేస్తాడని రోజా విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని పవన్.. చంద్రబాబు ఉచ్చులో చిక్కుకోకుండా వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. ఇప్పటికే వైజాగ్ ఎయిర్ పోర్టులో ఘటనలో పవన్ ను వాడుకున్న చంద్రబాబు… ఇప్పటంలో తెలివిగా పవన్ ను ఇరికించాడని ఆరోపించారు. ఇప్పటం ఉన్నది మంగళగిరి నియోజకవర్గంలో కాగా, ఇక్కడ పోటీ చేసేది చంద్రబాబు కొడుకు లోకేశ్ అని, కానీ ఇప్పటం గ్రామానికి పవన్ వెళ్లి ఇరుక్కుపోయాడని వివరించారు. తాజాగా హైకోర్టు సైతం ఇప్పటం గ్రామస్థులకు షాక్ ఇచ్చిందని , కోర్ట్ ను తప్పు పట్టరాని, నోటీసులు ఇచ్చిన ఇవ్వలేదని కోర్ట్ కు తెలిపారని కోర్ట్ తెలుపుతూ వారికీ లక్ష రూపాయిల చొప్పున ఫైన్ వేసిందని రోజా అన్నారు. ఇంతకంటే పెద్ద దెబ్బ పవన్ కళ్యాణ్ కు మరోటి ఉండదని రోజా అన్నారు.