తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎస్‌ఈసీ

తిరుమల: తిరుమల శ్రీవారిని ఏపి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ప్రార్థించానని నిమ్మగడ్డ తెలిపారు.

అలాగే ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రజలందరూ విరాళిస్తున్నారన్నారు. హిందువులకు అయోధ్య రామాలయం ఆరాధ్య దేవాలయంగా విరాజిల్లనుందన్నారు. దేశం ఆర్థిక ప్రగతి సాధించాలని శ్రీవారిని ప్రార్థించానని ఎంపీ జీవీఎల్‌ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/