డ్రగ్స్ కేసు : ముగిసిన హీరో రానా ఈడీ విచారణ..ఏ ఏ ప్రశ్నలు అడిగారంటే

డ్రగ్స్ కేసు : ముగిసిన హీరో రానా ఈడీ విచారణ..ఏ ఏ ప్రశ్నలు అడిగారంటే

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఈరోజు (సెప్టెంబర్ 8 ) సినీ నటుడు రానా ను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 7 గంటల పాటు రానాను ఈడీ అధికారులు విచారించడం జరిగింది. డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న కెల్విన్ ను మరోసారి విచారించారు. రానా – కెల్విన్ ఇద్దరినీ కూర్చుపెట్టి అరగంట పాటు ఇద్దర్ని పలు ప్రశ్నలు అడిగారు.

రానాను ముఖంగా కెల్విన్ కు ఎందుకు డబ్బులు పంపారని ప్రశ్నించడం జరిగింది. రానా కు సంబదించిన రెండు బ్యాంకు అకౌంట్లను తీసుకున్నారు. 2015 -17 లకు సంబదించిన స్టేట్మెంట్స్ ను అధికారులు పరిశీలించారు. అలాగే కెల్విన్ కు సంబదించిన లాప్ టాప్ ను ఓపెన్ చేయించి పలు విషయాలు తెలుసుకున్నారు.

డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ చార్మి, రకుల్, నటుడు నందును ఈడీ విచారించింది. రేపు హీరో రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్ ను విచారించనున్నారు అధికారులు.