ఈ డ్యామ్ ఐదు గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుంది
మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హరీశ్ రావు

మెదక్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు మెదక్ జిల్లాలోని హవెలి ఘన్పూర్ మండలం సర్దన గ్రామంలో మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణం కల త్వరలోనే నెరవేరనుందన్నారు. 12.50 కోట్ల రూపాయలతో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. సిఎం కెసిఆర్ రైతుబిడ్డ అయినందునే ఈ కల నేరవేరుతుందని హరీష్రావు తెలిపారు. మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని వివరించారు. సర్దన వద్ద చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్న హరీశ్ రావు… ఈ డ్యామ్ ఐదు గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. కాగా సమైక్య పాలకుల కుట్రల వల్లే మంజీరాపై చెక్ డ్యామ్ నిర్మించడం సాధ్యం కాలేదని అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/