ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
curfew-extension-in-ap
అమరావతి : ఏపీ లో కర్ఫ్యూ సడలింపుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. అయితే సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇచ్చారు. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ వచ్చేంత వరకు ఆంక్షల కొనసాగింపు ఉంటుందని తెలిపింది. ఇక రాష్ర్టమంతా థియేటర్లు, జిమ్‌లు, ఫంక్షన్ హాళ్లను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శానిటైజర్, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని పునరుద్ఘాటించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/