తూఫాన్ ఎఫెక్ట్ ..శ్రీశైలం ప్రయాణాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు

ap-former-cm-chandrababu-at-aig-hospital-for-health-checkup

మిగ్‌జాం తూఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షలు పడుతున్నాయి. అనేక రహదారులు తెగిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తూఫాన్ కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు శ్రీశైలం ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఈరోజు శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ని దర్శించుకోవాలని అనుకున్నప్పటికీ తూఫాన్ కారణంగా వాయిదా వేసుకున్నాడు.

ఇప్పటికే తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు.. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం (డిసెంబర్ 5న) శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే, తుపాను కారణంగా పర్యటనను వాయిదా వేసిన చంద్రబాబు.. రానున్న రోజుల్లో శ్రీశైలం మల్లన్న, కడప దర్గా, మేరీమాత చర్చిలను దర్శించుకోనున్నారు. మరోవైపు, తుపాను తీవ్రత కారణంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.