బాధ్యత గల ప్రభుత్వంగా అడుగులు వేశామని గర్వంగా చెబుతున్నా

అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాల్లో సిఏం జగన్‌మోహన్‌ రెడ్డి

AP CM Jagan
AP CM Jagan

Amaravati: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా లంచం లేదు..వివక్ష లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. గత 23 నెలల్లో ప్రజలకు నేరుగా రూ.93,708 కోట్లు అందించామని తెలిపారు. మరో రూ.31,714 కోట్లు ప్రజలకు పరోక్షంగా అందించామని తెలిపారు. మొత్తం రూ.లక్షా 25 వేల కోట్లు ప్రజలకు చేరవేశామని ప్రకటించారు. అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాల్లో సిఏం మాట్లాడారు.

కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచామని చెప్పారు. ప్రజలన్ని భయపెట్టే కధనాలు వేయోద్దని ఎల్లోమీడియాను కోరారు. మేనిఫెస్టో వాగ్ధానాల్లో 94.5 శాతం పూర్తి చేశామని చెప్పారు. గురువారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు.

రెండేళ్ల పాలనలో ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ఒక బాధ్యత గల ప్రభుత్వంగా అడుగులు వేశామని రెండేళ్ల తరువాత గర్వంగా చెబుతున్నాను. పెద్దలు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ గారికి నా తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు.
కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి శ్రద్ధాంజలి పాటిస్తూ..రెండు నిమిషాలు మౌనం పాటించాలని మీ ద్వారా కోరుతున్నాను.

ప్రాణం విలువ నాకు బాగా తెలుసు. దివంగత నేత , మహానేత వైయస్‌ఆర్‌ చనిపోయిన సందర్భంలో అనేక మంది చనిపోయారు. వారి వద్దకు వెళ్లి ఓదార్చాను. ప్రతి కుటుంబాన్ని పరామర్శించాను. ప్రాణం విలువ తెలుసు కాబట్టే..అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పులు తీసుకువచ్చాను. ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి. ఇది ప్రాణం పోసే స్కీమ్‌గా ఉండాలని రాష్ట్రంలో రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమం చేశాను. దాదాపుగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వెయ్యి జబ్బులకు మాత్రమే చికిత్సలు చేసేవారు. దాన్ని 2400 జబ్బులకు వర్తింపజేశాం.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఆలోచన చేయలేదు. ఏకంగా 1180 వాహనాలు, 108, 104 వాహనాలు ఏర్పాటు చేసి 20 నిమిషాల్లో అందుబాటులోకి తెచ్చాం. బెంజి సర్కిల్‌ నుంచి కుయ్‌ కుయ్‌ అంటూ ప్రతి మండలానికి పంపించామని తెలిపారు.

ప్రపంచానికి కోవిడ్‌ పెద్ద సవాల్‌ను విసిరింది. మన రాష్ట్రంలో మార్చిలో తొలి నాళ్లలో టెస్టులు చేయించేందుకు ఏకంగా పుణేకు పంపించాల్సి వచ్చేది. ఈ రోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో 150కి పైగా ల్యాబ్‌లు నడుస్తున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో లక్ష టెస్టులు పైగా చేస్తున్నాం. మొదటి కోవిడ్‌ దశలో 261 ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తే, 649 ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తరువాత మనకు కేవన్‌ సీటీలు లేకపోయాయి. మంచి ఆసుపత్రులు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అక్కడే అందుబాటులో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో ఒక టీచింగ్‌ కం నర్సింగ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ ఉంటేనే పేదలకు మెరుగైన వైద్యం అందించగలమనే తపనతో అడుగులు వేస్తున్నాం. ఆసుపత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని కోవిడ్‌ వైద్యసేవలు అందిస్తున్నాం. వాటి బాధ్యతను పూర్తిగా ప్రభుత్వ భుజస్కందాలపై వేసుకుంది. అక్కడ మందులు, సిబ్బందిని ఏర్పాటు చేయడం మంచి వైద్యం అందిస్తున్నాం. గత సెప్టెంబర్‌లో మనం తీసుకున్న ఆసుపత్రుల్లో 261లో 37441 బెడ్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

బడ్జెట్‌ సందర్భంగా ఈ ఏడాది అమలు చేసే పథకాల వివరాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ చెప్పారంటే కచ్చితంగా చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.

  • ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన.
  • మే మాసంలో వైయస్‌ఆర్‌ రైతు భరోసా మొదటి విడత రూ.7500, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా సొమ్ము . 25న వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా.
  • జూన్‌లో వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, జగనన్న తోడు పథకాలు .
  • జూలై లో జగనన్న విద్యా దీవెన, వైయస్‌ఆర్‌ కాపు నేస్తం, విద్యా కానుక.
  • ఆగస్టులో సున్నా వడ్డీ, ఎంఎస్‌ఎంఈలకు పారిశ్రామిక రాయితీలు, ఆగ్రిగోల్డు బాధితులకు చెల్లింపులు.
  • సెప్టెంబర్‌లో వైయస్‌ఆర్‌ ఆసరా. అక్టోబర్‌లో రైతుభరోసా, జగనన్న దీవెన.
  • నవంబర్‌లో అగ్రవర్ణాలకు చెందిన అక్కల కోసం వైయస్‌ఆర్‌ చేయూత.
  • డిసెంబర్‌లో జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, వైయస్‌ఆర్‌ లా నేస్తం,
  • జనవరిలో అమ్మ ఒడి, పింఛన్‌ రూ.2,250 నుంచి 2,500కు పెంపు, వైయస్‌ఆర్‌ రైతు భరోసా మూడో విడత.
  • ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత చెల్లింపులు .

ఇవి కాకుండా నిత్యం అమలు చేసే పథకాలు ఎక్కడా కూడా ఆపకుండా అమలు చేస్తామని. రెండేళ్ల పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు , పేద మధ్య తరగతి వర్గాల కోసం గట్టిగా నిలబడ్డామని గర్వంగా చెప్పగలను అని సిఏం జగన్ అన్నారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/