రాత్రి వేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది

ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా..చంద్రబాబు

TDP President Chandrababu
TDP President Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. టిడిపి మాజీ ఎంపీ సబ్బం హరికి చెందిన సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని కూల్చివేసిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. టిడిపి నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రి వేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం?’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులు తప్ప సమర్థులు కాదు’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/