ఈ నెల 16న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారన్న కేశినేని నాని

Kesineni Nani
Kesineni Nani

అమరావతి: కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను ఈ నెల 16వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఈ భారీ ఫ్లైఓవర్ కొంతకాలం కిందటే నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికి రెండుసార్లు ప్రారంభోత్సవం వాయిదా పడింది. తొలుత సెప్టెంబరు 4న ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆపై సెప్టెంబరు 18న మరో ముహూర్తం నిర్ణయించినా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో అది కూడా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే తాజా ముహూర్తం ఖరారు చేశారు. కాగా, అధికారిక ప్రారంభోత్సవం జరుపకపోయినా, ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ పై రాకపోకలు అనుమతించినట్టు తెలుస్తోంది.

కాగా దుర్గ గుడి ప్రారంభోత్సవాన్ని సిఎం జగన్‌తో పాటు నితిన్‌ గడ్కరీ వర్చువల్‌ ద్వారా ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. మొత్తం రూ.15 వేల 622 కోట్ల పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.7,500 కోట్లతో చేపట్టిన 16 ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజ చేయనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/