నేడు ఏలూరులో పర్యటించనున్న చంద్రబాబు
మాగంటి బాబును పరామర్శించనున్న చంద్రబాబు
Chandrababu
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఏలూరుకు వెళుతున్నారు. ఇటీవల పుత్ర వియోగం పొందిన టీడీపీ నేత మాగంటి బాబును ఆయన పరామర్శించనున్నారు. మాగంటి బాబు కుమారుడు రాంజీ ఇటీవల కన్నుమూశారు. రాంజీ మాగంటి బాబు పెద్ద కుమారుడు. టీడీపీ కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ తండ్రికి చేయూతగా నిలిచేవాడు. 37 ఏళ్ల రాంజీ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఏలూరులో చికిత్స అనంతరం విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. స్వగ్రామంలో రాంజీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాగంటి బాబు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
అనంతరం ఈ మధ్యాహ్నం ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలపై వారితో చర్చిస్తారు. పార్టీ బలోపేతంపై వారి అభిప్రాయాలు స్వీకరించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/