చంద్రబాబు అక్రమ అరెస్ట్ జగన్ రెడ్డి సైకో చర్య

ఏపీ తెదేపా అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

Achchennaidu angry over Chandrababu’s arrest

అమరావతి : నీతి నిజాయితీకి మారుపేరుగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. సైకో జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న విషయం రాష్ట్ర దేశ ప్రజానీకాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఒక ప్రజా నాయకుడిని నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం పైన ప్రజాస్వామ్యవాదుల పైన దాడి చేస్తున్నారని ఈ దాడిని ఖండించడానికి తెలుగుదేశం పార్టీ సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిస్తుందన్నారు. ఈ బందుకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, స్వచ్ఛంద సంఘాలు మీ ప్రాంతాల్లో శాంతియుతంగా ప్రజాస్వామ్యం బద్దంగా బందు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అచ్చెన్నాయుడు కోరారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/category/telangana/