రాజమండ్రి జైల్లో చంద్రబాబు కు ఏ నెం కేటాయించారంటే..

స్కిల్‌ డెవలవప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్ట్ మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు కు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలి సారి చంద్రబాబు.. జ్యూడీషియల్‌ రిమాండ్‌కు వెళ్లారు. ఏసీబీ కోర్టు ఆదేశాలతో సీఐడీ పోలీసులు.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జోరు వానలోనే చంద్రబాబు వాహనం రాజమండ్రి కి బయలుదేరింది. ఆదివారం అర్థరాత్రి.. 1.16 గంటల సమయానికి చంద్రబాబు వాహన శ్రేణి రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ వద్దకు చేరుకుంది.

ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు.. జైలు అధికారులు.. చంద్రబాబుకు స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. అంతేకాక కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు గేటు దగ్గర నుంచే ఎన్ఎస్‌జీ కమాండోలు వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం లోకేశ్‌ లోపలికి వెళ్లి చంద్రబాబుకు ఇవ్వాల్సిన ఆహారం, మందుల గురించి అధికారులతో మాట్లాడి వచ్చారు. అలాగే కుటుంబ సభ్యులు.. ఏ సమయంలో చంద్రబాబును కలవవచ్చో.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.