తెలుగు అకాడమీ కేసులో మరో నలుగురు అరెస్ట్

తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో పోలీసులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో పది మందిని అదుపులోకి తీసుకోగా..ఇప్పుడు మరో నలుగుర్ని అరెస్ట్ చేసారు. ఇక ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ ని మూడు రోజుల పాటు విచారించారు సీపీఎస్‌ పోలీసులు. ఇదే కేసు లో అరెస్ట్ అయిన ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్య నారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్ లను నేడు కస్టడీ లోకి తీసుకోనున్నారు పోలీసులు.

భూపతి సాయంతో తెలుగు అకాడమీ డిపాజిట్లను యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా సాయి కుమార్ చూశారని వివరించారు. ఏడాది నుంచి చేయాల్సిన డిపాజిట్లను పదిహేను రోజులకే ఈ ముఠా చేసిందని అన్నారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్‌లు డిపాజిట్ పత్రాలను ఫోర్జరీ చేసినట్లు పేర్కొన్నారు. 64.5 కోట్లను కొల్లగొట్టి నిందితులు వాటాలు పంచుకున్నారని, 20 కోట్లు సాయి కుమార్, 7 కోట్లు వేంకటరమణ, 3 కోట్లు రాజ్ కుమార్, 3 కోట్లు వేంకటేశ్వర్ రావు, 6 కోట్లు కృష్ణారెడ్డి, 2.5 కోట్లు భూపతి, 6 కోట్లు రమణా రెడ్డి, 50 లక్షలు పద్మనాభన్, 30 లక్షలు మదన్, 10 కోట్లు సత్యనారాయణ, 2.5 కోట్లు మస్తాన్ వలీ, 2 కోట్లు కెనరా బ్యాంకు మేనేజర్ సాధన, 50 లక్షలు యోహన్ రాజు తీసుకున్నారని తెలిపారు.

మరి కొంత మంది నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును పోలీసులు అనుమతి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.