కేసీఆర్ ను పరామర్శించనున్న చంద్రబాబు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడుతుంది. గురువారం రాత్రి తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. డాక్టర్స్ ఆయన్ను వాకర్ సాయంతో నడిపిస్తున్నారు.

ఇక కేసీఆర్ హాస్పటల్ లో చేరిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు , శ్రేణులు పెద్ద ఎత్తున హాస్పటల్ కు వెళ్లి ఆయన ఆరోగ్యం ఫై ఆరా తీస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు హాస్పటల్ కు వెళ్లి పరామర్శించనున్నారు. కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. నిన్న ఆదివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..కేసీఆర్ ను పరామర్శించి , ఆరోగ్య వివరాలు అడిగితెలుసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్ని పక్కనబెట్టి ప్రతి ఓపక్కరు కేసీఆర్ ను కలుస్తుండడం ఫై పలువురు మేధావులు, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.