ఉస్మాన్‌సాగ‌ర్ రెండు గేట్లు ఎత్తివేత‌

హైదరాబాద్ : ఇటీవల కురుస్తున్న‌ భారీ వ‌ర్షాల‌కు ఉస్మాన్‌సాగ‌ర్‌(గండిపేట‌) జ‌లాశయానికి వ‌రద నీరు భారీగా చేరుతోంది. ఇప్ప‌టికే జ‌లాశ‌యం పూర్తిస్థాయి నీటి మ‌ట్టానికి చేరుకుంటోంది. దీంతో ఇవాళ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఉస్మాన్‌సాగ‌ర్ రెండు గేట్ల‌ను ఒక అడుగు మేర ఎత్తి నీటిని మూసీ న‌దిలోకి నీటిని వ‌దిలారు. కాగా, మ‌రో మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/