దేవినేని ఉమను పరామర్శించిన చంద్రబాబు

గుండెపోటుతో దేవినేని శ్రీమన్నారాయణ మృతి


అమరావతి : టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ తుదశ్వాస విడిచారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. శ్రీమన్నారాయణ వయసు 88 సంవత్సరాలు. ఆయన స్వగ్రామం కంకిపాడు మండలం నెప్పల్లి అయినప్పటికీ… కంచికచర్లలో స్థిరపడ్డారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

క్రియాశీలక రాజకీయాల్లో ఆయన లేనప్పటికీ… తన కుమారులు దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎన్నోసార్లు పాల్గొన్నారు. ఆయన అంత్యక్రియలను కంచికచర్లలో నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.

మరోవైపు దేవినేని ఉమ నివాసం వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. శ్రీమన్నారాయణకు నివాళి అర్పించారు. దేవినేని ఉమను, కుటుంబసభ్యులను ఓదార్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/