ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకొవాలి

వైజాగ్‌లో మంచి వాతావరణం ఏర్పడే దిశగా ప్రభుత్వం కృషిచేయాలి

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

విశాఖపట్టణం: వైజాగ్‌లో మంచి వాతావరణం ఏర్పడే దిశగా ఆలోచించి, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విశ్వసిస్తున్నానంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్వీట్లు చేశారు. ‘వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనాదృక్పథం అవలంబిస్తే మంచిది. వైజాగ్ కి ప్రాచీన నామం అయిన వాల్తేరు పేరుతో 1883 లో ప్రారంభం అయినప్పటినుంచి ఈ క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమైంది, వైజాగ్ బ్రాండ్ లో భాగమైంది’ అని తెలిపారు. ‘అందరికీ ఆహ్లాదాన్ని, ఆతిథ్యాన్ని ఇచ్చే మచ్చికైన ప్రాంతం కావడంతో దీనితో అనుబంధం పెరిగింది. ఇందులో ఎందరో విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, దేశభక్తులు, వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన నిపుణులు, దేశ విదేశాలలో తమ తమ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వారు చాలా మంది సభ్యులుగా ఉన్నారు’ అని చెప్పారు. ‘ఈ సున్నితత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం దీనిని యథాతథంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే… వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి, కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాను’ అని ఆయన తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/