ఏపిలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదుః పురందేశ్వరి

ఎయిమ్స్ కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని మండిపాటు

purandeswari

అమరావతిః ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో సాయం చేస్తోందని… అయినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ భవనాలకు, పరిశోధనలకు కేంద్రం నిధులను ఇచ్చిందని… అయినా ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని దుయ్యబట్టారు. యడ్లపాడు పార్కు అభివృద్ధి ఆగిపోయిందని, ఎయిమ్స్ కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.