క‌ల‌హాల‌తో కుటుంబం మొత్తం ఆత్మహత్య


ఫ్యాన్ కు ఉరి వేసుకున్న చంద్రకాంత్

పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన భార్య

హైదరాబాద్ : హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రకాంత్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. భార్య లావణ్య, పిల్లలతో కలిసి బీహెచ్ఈఎల్ ప్రాంతంలోని తెల్లాపూర్ విద్యుత్ నగర్ లో ఉంటున్నాడు. ఇటీవలి కాలంలో ఆయన అప్పులు చేశాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

నిన్న ఉదయం కూడా ఇద్దరి మద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ జరిగిన తర్వాత పిల్లలను తీసుకుని లావణ్య బయటకు వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన చంద్రకాంత్ ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య పిల్లలతో కలిసి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా అందరినీ కలచి వేస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/