గచ్చిబౌలిలో దారుణం.నిండు గర్భిణీ అతి కిరాతకంగా చంపాడు

Crime scene
Bad in Gachibowli

హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో దారుణం జరిగింది. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా ఓ వ్యక్తి అతి దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

రాజమహేంద్రవరం కి చెందిన వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతి తో కలిసి కొండాపూర్ లో నివాసం ఉంటున్నారు. వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా ఉండి చిన్నమ్మ కుమార్తె లక్ష్మి ప్రసన్నకు 2020లో శ్రీరామకృష్ణ తో వివాహం జరిపించాడు. కొంతకాలం పాటు వారి సంసారం సజావుగా సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ లక్ష్మీ ప్రసన్నను శారీరకంగా మానసికంగా శ్రీ రామకృష్ణ వేధిస్తుండడం మొదలుపెట్టాడు. శ్రీ రామకృష్ణ వేదింపులు తట్టుకోలేక.. గత ఏడాది పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినప్పటికీ శ్రీరామకృష్ణ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చందానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది భార్య లక్ష్మీ ప్రసన్న. అయితే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి తన పరువు తీయడం, పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం ఇవ్వన్నీ కూడా వెంకట్ రామకృష్ణ దంపతులు వెనుకాల ఉండి చేయిస్తున్నారని శ్రీరామకృష్ణ వారిపై కక్ష పెంచుకున్నాడు.

దీంతో ఈనెల 6న కొండపూర్‌లో ఉంటున్న వెంకట్ రామకృష్ణ ఇంటికి వేట కోడవలితో వెళ్లాడు. స్రవంతి వేటకొడవలిని చూసి కేకలు వేసి బయటకు వేళ్లే ప్రయత్నం చేసింది. అయితే నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుక భాగం భుజం మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు శ్రీ రామకృష్ణ. ఇక గాయాలపాయలైన స్రవంతిని ఆసుపత్రికి తరలించగా అదే రోజు రాత్రి 11 గంటలకు మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.