చంద్రబాబు ఆరోగ్యం ఫై రాజమండ్రి జైలు డిప్యూటీ సూపరింటిండెంట్ క్లారిటీ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. స్కిన్ అలర్జీతో ఇబ్బందులు పడుతుండడం తో ..స్కిన్‌ అలర్జీ డాక్టర్‌ జైలుకు చేరుకున్నారు. ఈ క్రమ్మలో చంద్రబాబు ను పరీక్షించి , చంద్రబాబుకు అలర్జీ సమస్య ఉందని వారు గుర్తించినట్లు జైలు డిప్యూటీ సూపరింటిండెంట్ రాజ్ కుమార్ తెలిపారు.

చంద్రబాబుకు కొన్ని మందులు సూచించారని, వైద్యులు సూచించిన మందులను చంద్రబాబుకు అందిస్తామని తెలిపారు. ఆ మేరకు చంద్రబాబు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. మరోపక్క ఫైబర్ నెట్ కేసులో CID దాఖలు చేసిన పిటి వారంటును విజయవాడ ఏసిబి కోర్టు సమ్మతించింది. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 లోపు చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరు పరచాలని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు.