ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత…హైదరాబాద్ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా గుండె సంబంధిత చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించడం జరిగింది.