పవన్ కు పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు

Pawan-kalyan
Pawan-kalyan

అమరావతిః నేడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ సినీ నటులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని టిడిపి అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నారని చెప్పారు.

‘జనసేన’ అధ్యక్షుడు, సోదరుడు పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

ఈ విశ్వంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. పవన్ ఈశ్వరుడు ఒక్కడే. మా దేవరకు జన్మదిన శుభాకాంక్షలు – బండ్ల గణేశ్

నా గురువు, ధైర్యం పవన్ మామకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా – సాయి ధరమ్ తేజ్

మంచితనానికి మారుపేరు, మంచి మనసుకు నిర్వచనం అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం… ఇవన్నీ కలబోస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు – పరుచూరి గోపాలకృష్ణ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా సార్ – నితిన్

పవన్ కల్యాణ్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధించాలి – మంచు మనోజ్

పవర్ ను తన ఇంటి పేరుగా మార్చుకున్న స్నేహితుడు పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి – రవితేజ

మంచి మనిషి, జనసేనాని పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు – రామ్ పోతినేని

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/specials/career/