యనమల రామకృష్ణుడిపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌

టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ చేసారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించింది యనమలనే అంటూ విజయసాయి ట్వీట్ చేసారు. బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఉపాధి దొరికి యువత స్వతంత్రులవుతారన్నది టీడీపీ ఏడుపు అని… కేంద్రం వేయి కోట్ల గ్రాంట్ ఇస్తుందన్నారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించిన దుర్మార్గపు యనమల సొంత జిల్లా గొంతు కోస్తున్నాడని ఆగ్రహించారు. బల్క్ డ్రగ్ కేపిటల్ గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ కాలుష్యమయం అయిపోయిందా మలమల ? అంటూ చురకలు అంటించారు. మహానాడుకు వచ్చిన జనం గట్టిగా చప్పట్లు కొట్టారు. అది చూసి పార్టనర్ తో పొత్తే లేదన్నారు తెలుగు తమ్ముళ్లు. పచ్చకుల మీడియా ప్రచారం వాపే తప్ప బలుపు కాదని లేటుగా గ్రహించిన చంద్రబాబు మళ్లీ పొత్తులంటూ వెంపర్లాట. పచ్చ కుల మీడియా నీకు పట్టం కట్టినా, జనం ఛీ కొడుతున్నారు బాబూ అంటూ మరో ట్వీట్‌ లో ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.

బల్క్ డ్రగ్ పార్క్ ఫై టీడీపీ చేస్తున్న ప్రచారం ఫై ఏపీ ప్రభుత్వం సైతం విమర్శలు చేసింది. ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేలా టీడీపీ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాలతో పోటీపడి ఏపీ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ సాధించింది. సుమారు రెండేళ్లు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం ఏపీ ప్రయత్నించింది. గుజరాత్‌, మహారాష్ట్ర, ఏపీలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కాకినాడ సెజ్‌లో 2వేల ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. దీంతో ఏపీకి ఫార్మా కంపెనీలు, వేలాది మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ క్రమంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌తో కాలుష్యమంటూ టీడీపీ ఫిర్యాదులు చేస్తుందని ఫైర్ అయ్యింది.