ఇదే హింస బాబూ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్

సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్ష పార్టీల ఫై నిప్పులు చెరిగే వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి చంద్రబాబు ఫై సెటైర్లు వేశారు. చంద్రబాబు ప్రస్తుతం జిల్లాల పర్యటన చేస్తూ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ..ప్రభుత్వ తప్పులను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు కుప్పం పర్యటన ఫై విజయసాయి ట్వీట్ చేసారు.

కుప్పంలోని బోయినపల్లెకు చంద్రబాబు రాత్రి 10 గంటలకు వెళ్లారని, బాబు వచ్చారంటూ ఆక్కడి జనాన్ని స్ధానిక టీడీపీ నేతలు నిద్రలేపి తరలించారని, తీరా అక్కడికి వెళ్తే నారాయణను ఎలా అరెస్టు చేస్తారని వారిని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా శ్రీలంకలోలా జనం తిరగబడాలని సందేశం కూడా ఇచ్చివచ్చారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇదేం హింస బాబూ అంటూ ఆయన్ను సాయిరెడ్డి ట్వీట్ లో ప్రశ్నించారు. మరో ట్వీట్ లో ఓసారి పులి తరిమితే బాబు చెట్టెక్కారని, పైన ఎలుగుబంటి కనిపించిందని, గతంలో తనకు ద్రోహం చేశాడు కాబట్టి కిందకు తరిమేయమని పులి భల్లూకాన్ని కోరిందని సాయిరెడ్డి పేర్కొన్నారు. అయినా నా ఇంటికొచ్చాడు కాబట్టి హాని చేయనని భల్లూకం చెప్పిందని, బాబుతో పొత్తుపెట్టుకుంటే జరిగేది ఇదే అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.