సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా?: చంద్రబాబు

యశ్ అరెస్ట్ ను ఖండిస్తున్నామన్న చంద్రబాబు

chandrababu

అమరావతిః టిడిపి ఎన్నారై నేత యశ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. యశ్ అరెస్ట్ ను ఖండిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై కాకుండా… అంగన్వాడీల సమస్యలపై దృష్టిని సారించాలని చెప్పారు. తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్న వారిని అణచివేయాలని చూడటం సరికాదని అన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు, చెల్లింపులు లేవని విమర్శించారు. సంక్షేమ పథకాలకు కూడా వివిధ ఆంక్షలు పెట్టి కోతలు విధిస్తున్నారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడానికి, ప్రజలను వేధించడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని… సమాజ సేవ చేస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలని అన్నారు.