వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

ఈ మధ్య తెరాస పార్టీ నేతలు వరుసపెట్టి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు వీరిని వివాదాల్లో చిక్కుకునేలా చేస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ తన భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని కరీంపేట సర్పంచి మల్లయ్య సంచలన ఆరోపణలు చేశారు.

ఈ మేరకు ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణ ఆడియోను విడుదల చేశారు. తనకు మద్ధతుగా వచ్చిన తిమ్మాపూర్ మండలం మొగలిపాలెం మాజీ సర్పంచిపై పోలీసులతో దాడి చేయించారని మల్లయ్య ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకిషన్ దౌర్జన్యాలు, వేధింపులు భరించలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ మధ్యనే భూఅక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈటెల రాజేందర్ ను మంత్రి పదవి నుండి తొలగించడం..ఆ తర్వాత ఈటెల పార్టీ కి రాజీనామా చేయడం తో పాటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం..తర్వాత బిజెపి లో చేరడం..హుజురాబాద్ నియోజకవర్గం నుండి పోటీలో దిగడం చకచకా జరిగిపోయింది.