శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం దుబాయ్‌ నుంచి వచ్చిన విమానంలో 2.3 కిలోల బంగారం లభించింది. ముందస్తు సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో సీటు కింద ఉన్న లైఫ్‌ జాకెట్‌లో బంగారు బిస్కెట్లను గుర్తించారు. దీంతో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటనలో కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న షేక్ మస్తాన్ అనే ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అక్రమంగా బంగారాన్ని లోదుస్తుల్లో తరలిస్తున్న నిందితుడి మస్తాన్‎ని కస్టమ్ అధికారులు గుర్తించారు. నిందితుడి వద్ద ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/