ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి

‘కే’ రకం మందుపై నివేదిక వచ్చాకే నిర్ణయం

Permission for anandaiah medicine
Permission for anandaiah medicine

Amaravati: కృష్ణ పట్నం ఆనందయ్య త‌యారు చేసిన ఆయుర్వేద మందు పంపిణీకి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమతి ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇ‍చ్చే పీ,ఎల్‌,ఎఫ్‌ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే , కంట్లో వేసే ‘కే’ రకం మందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కే మందుకు సంబంధించి విచారణ రిపోర్టు రానందున, ప్రస్తుతం ఈ మందుకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. కంట్లో వేసే చుక్కల మందుకు సంబంధించి నివేదిక రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదిక పరీశీలించిన అనంతరం దానిపై పై నిర్ణయం తీసుకోనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/