ఈరోజు కుటుంబ సభ్యులతో చంద్రబాబు ములాఖత్

స్కిల్ డెవలప్ కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు కుటుంబ సభ్యులతో ములాఖత్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు ఉదయం వాకింగ్, యోగా చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి చంద్రబాబు త్వరగా నిద్రపోయారని తెలిపారు. చంద్రబాబుకు ఆయన సహాయకుడు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నాడు.

ఈ వారానికి ముగ్గురికి మాత్రమే ములాఖత్ కు అనుమతిస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి కూడా అనుమతి ఉండటంతో ఆయనకు అందించే భోజనాన్ని అధికారులు పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద 144వ సెక్షన్ విధించారు. టీడీపీ పార్టీ శ్రేణులు అటు వైపు రాకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఈ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది. దీనికి సంబంధించిన వాదనలు నిన్ననే ముగిశాయి.