జూ. ఎన్టీఆర్ పిల్లలకు బట్టలు పంపిన అలియాభట్

ఆర్ఆర్ఆర్ మూవీ లో సీత గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అలియా భట్..తాజాగా ఎన్టీఆర్ పిల్లలకు బట్టలు పంపించి ఆకట్టుకుంది. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అవుట్‌ఫిట్స్ అభయ్, భార్గవ్‌కు నచ్చాయని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఎన్టీఆర్.. అలియాకు థాంక్స్ చెప్తూ తన కోరికను బయటపెట్టాడు.
ఎన్టీఆర్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో అలియా బ్రాండ్ అవుట్‌ఫిట్స్ కలిగిన రెండు ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ పిక్‌ను షేర్ చేశాడు. ఇవి పంపినందుకు అలియాకు థాంక్స్ చెబుతూ.. వాళ్ల ముఖాలు చిరునవ్వుతో వెలిగిపోయాయని పేర్కొన్నాడు. అంతేకాదు త్వరలో తన పేరుతోనూ ఒక బ్యాగ్ చూడాలనుకుంటున్నట్లుగా పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన అలియా.. నీ కోసం ఈద్ స్పెషల్ వేర్ సిద్ధం చేస్తానంటూ హార్ట్ సింబల్స్ యాడ్ చేసింది. చివరగా థాంక్స్ చెప్తూ తారక్‌ను ‘స్వీటెస్ట్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక అలియా..గతేడాది బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకొని..పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.