వైసీపీ మేనిఫెస్టో విడుదల ఫై చంద్రబాబు విమర్శలు

chandrababu public meeting in Anakapalle District Madugula

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో చంద్రబాబు.. సీఎం జగన్ ఫై మండిపడ్డారు. గత ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ..ఈసారి అంతకు మించి సంక్షేమ పథకాలతో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ తమ మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో ఉండబోతుందని, ఈ ఐదేళ్లలో ప్రజలను ఆకట్టుకున్న అన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు.

అయితే ఈ మేనిఫెస్టో విడుదల ఫై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టు మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు… ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు?’ అని జగన్ పాత వీడియోను షేర్ చేశారు.