కాంగ్రెస్ లోకి గుత్తా కుమారుడు అమిత్ రెడ్డి..?

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరగా..తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.

బీఆర్ఎస్ నుంచి నల్లగొండ లేదా భువనగిరి ఎంపీ ఎంపీగా తనకు అవకాశం కల్పించాలని పార్టీని కోరారు. అయితే.. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇతర సీనియర్ల నుంచి సహకారం లేని కారణంగా ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో అప్పటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.