టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

తాడికొండ మాజీ మ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని TDP అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జరిగిన మ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈమె వార్తల్లో నిలిచారు. ఆ తరువాత వైసీపీ ఈమెను సస్పెండ్ చేయడం తో టీడీపీలో చేరారు. బాపట్ల ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. ఇటీవల టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నేత రాజేశ్ ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.

ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా, తాడికొండ లో 1969లో జన్మించింది. ఆమె 1993లో బెంగళూరు ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావు 1978లో తాడికొండ నుంచి రెడ్డి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ గెలుపొందాడు, తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయురాలు. ఉండవల్లి శ్రీదేవి 2017లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, తాడికొండ నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా పని చేసి, నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, రాజన్న క్యాంటీన్‌ లాంటి కార్యక్రమాలతో ప్రజకు చేరువైంది..డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ పై 4433ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.