టీ20 నుండి సౌతాఫ్రికా అవుట్

,

టి 20 వరల్డ్ కప్ నుండి సౌతాఫ్రికా నిష్ర్కమించింది. నెదర్లాండ్స్ – సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా ఫై నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ మార్గం సుగమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 158 పరుగులు చేసింది. అయితే.. చేధనలో సౌత్ ఆఫ్రికా ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 145 రన్స్ మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికాపై 13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ విజయం సాధించింది.

ఈరోజు టీమిండియా.. జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే 8 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంటుంది. ఒకవేళ పరాజయం పొందినా సెమీస్ చేరే విషయంలో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. మరో మ్యాచ్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా డైరెక్ట్ గా సెమీస్ కు చేరుకుంటుంది. ఓడిపోతే మాత్రం నెట్ రన్ రేట్ పై ఫలితం ఆధారపడుతుంది. దీంతో సెమీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.