రాష్ట్రానికి తలవంపులు తెచ్చే ఘటనః చంద్రబాబు విమర్శలు

హైదరాబాద్‌లో యాంటీ డ్రగ్ ఆపరేషన్

tdp-chandrababu-fires-on-ysrcp-govt

అమరావతిః హైదరాబాద్‌లో ఇద్దరు ఏపీ పోలీసులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. దురదృష్టవశాత్తు గత నాలుగున్నరేళ్లుగా ఏపీ పేరు అభివృద్ధిలో కంటే డ్రగ్స్ విషయంలోనే ఎక్కువగా వినిపిస్తోందని పేర్కొన్నారు.
తాజాగా కాకినాడకు చెందిన ఇద్దరు పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ కావడం తీవ్ర ఆందోళనకర అంశమని, రాష్ట్రానికి తలవంపులు తెచ్చే ఘటన అని విమర్శించారు.”ఈ విచారకరమైన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు… ఎవరెవరు నేతలు ఇందులో ఉన్నారు?” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.