రాజకీయాల్లోకి తమిళ హీరో ..కొత్త పార్టీని ప్రకటించిన విజయ్‌

actor-vijay-enters-politics-announces-the-name-of-his-party

చెన్నై: తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ నటుడు విజయ్‌ ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీని ప్రకటించారు. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమని వెల్లడించారు. అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. త్వరలోనే తమ జెండా, ఎజెండా ప్రకటిస్తామని విజయ్‌ తెలిపారు. అయితే ఈమధ్య కాలంలో విజయ్.. సేవాకార్యక్రమాలతో ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. స్టూడెంట్స్ కి స్కాలర్‌షిప్ ఇవ్వడం, ఇటీవల వచ్చిన వరదలకు బాధ పడిన బాధితులకు సహాయం చేయడం కోసం.. విజయ్ స్వయంగా రావడం రాజకీయ రంగప్రవేశానికి సంకేతాలు సూచించాయి.

ఇప్పుడు విజయ్ తన రాజకీయ రంగప్రవేశం గురించి అధికారికంగా ప్రకటించారు. ‘విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు చేసిన విజయ్.. కేవలం స్వచ్ఛంద సంస్థతో పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణలను తీసుకురావడం అసాధ్యమని పేర్కొన్నారు. అందుకు రాజకీయ అధికారం కావాలని, అందుకే తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీకి దిగబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఇన్నాళ్లు మాటల్లోనే ఉన్న ఈ పార్టీ ప్రకటన ఇప్పుడు నిజం కావడంతో.. తమిళనాటతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సంచనలంగా మారింది. కాగా తమిళనాట ఇప్పటికే చాలామంది సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. మరి విజయ్ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటారో చూడాలి.