అర్ధరాత్రి వేళ ఆ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ తెలిపిన పవన్

జనసేన ఫై అభిమానంతో ఒడిలో ఓ చంటి బిడ్డ పెట్టుకొని , భుజం మీద జనసేన జెండాతో అర్ధరాత్రి వరకు విశాఖ బీచ్‌ రోడ్డులో కూర్చున్న మహిళ కు పవన్ కళ్యాణ్ హ్యాట్సాఫ్ తెలపడమే కాదు..ఆమె కుటుంబాన్ని మంగళగిరి పార్టీ ఆఫీస్ కు పిలిపించుకొని ఆమెతో మాట్లాడి, ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన పలు ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటన ఫై జనసేన కార్య కర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం , పవన్ కళ్యాణ్ ను అడ్డుకొని హోటల్ కే పరిమితం చేయడం తెలిసిందే. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు నోవెటల్ హోటల్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు , కార్య కర్తలు చేసుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అభిమానులంతా వెనుతిరిగి వెళ్లిన..ఓ మహిళ మాత్రం భుజాన జనసేన జెండాతో.. తన నాలుగేళ్ల బిడ్డతో కలిసి విశాఖ బీచ్‌లో కూర్చుని అందర్నీ ఆశ్చర్య పరిచింది. పలు మీడియా ఛానల్ లలో , సోషల్ మీడియా లో ఈమె తాలూకా ఫొటోస్ వైరల్ కావడం తో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆమెను మంగళగిరి పార్టీ ఆఫీస్ కు పిలిపించుకొని మాట్లాడారు.

‘శనివారం ఉదయమే నోవాటెల్ హోటల్‌కు వచ్చాం. పవన్ కళ్యాణ్ ర్యాలీలో పాల్గొన్నాం. ఆదివారం ఉదయం జనవాణి కార్యక్రమం కోసం పోర్టు కళావాణి స్టేడియానికి వెళ్లాం. కానీ జనసేనాని రాకపోవడంతో మళ్లీ నోవాటెల్ హోటల్‌కి వెళ్లాం. ఆదివారం రాత్రంతా అక్కడే ఉన్నాం. అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చి బీచ్ రోడ్డులో ఇంత సేపు ఉండొద్దని, ఇంటికెళ్లమని చెప్పారు. దీంతో ఇంటికి బయల్దేరగా.. దారిలో వైస్సార్సీపీ రౌడీలు మాపై దాడి చేసి ఆటోను ధ్వంసం చేశారు. ఆటోలో ఉన్న పవన్ కళ్యాణ్‌ ఫొటోలను చింపేసి.. ఆటోను పాక్షికంగా ధ్వంసం చేశారు. వాస్తవానికి ఆ రాత్రంతా మేం బీచ్‌లో రోడ్డులోనే ఉండాలని అనుకున్నాం. కానీ పోలీసులు పంపేయడంతో వెళ్లాల్సి వచ్చింది. జనసేన జెండాను లాక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ నా ప్రాణం పోయినా జెండాను మాత్రం విడిచి పెట్టేది లేదని చెప్పాను’ అని పవన్ కళ్యాణ్ కు గోవిందం తెలిపారు. ఆ దంపతులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పార్టీ తరఫు నుంచి లక్ష రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందించారు.