బిజెపి తో పొత్తు ఫై చంద్రబాబు క్లారిటీ

chandrababu-naidu

టీడీపీ అధినేత చంద్రబాబు..రాబోయే ఎన్నికల్లో బిజెపి తో పొత్తు ఫై స్పందించారు. బిజెపితో పొత్తు పెట్టుకునే విషయంలో ఇప్పుడే మాట్లాడలేనని తెలిపారు. రాష్ట్ర సమస్యల మీద ప్రజలు, ప్రభుత్వం గట్టిగా ఉంటే కేంద్రం తనంతట తానే దిగివస్తుందని చెప్పుకొచ్చారు. దీనికి ఉదాహరణగా జల్లికట్టు ఘటనను చెప్పుకొచ్చారు. అవసరమైతే తానే ఢిల్లీతో పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన వాలంటీర్ల గురించి చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను ప్రజాసేవకు మాత్రమే పరిమితం చేస్తామని.. ఈ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదని వెనకేసుకొచ్చారు. వాలంటీర్ల సేవలకు తాము గౌరవం ఇస్తామని.. కానీ, వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహం అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు. వాలంటీర్లు వైస్సార్సీపీ కార్యకర్తల్లా పనిచేస్తామంటే మాత్రం సహించేది లేదన్నారు.

మరోపక్క వాలంటీర్ల ఫై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ఫై రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పవన్ కళ్యాణ్ ఫై పోలీస్ స్టేషన్ లో పిర్యాదులు చేస్తున్నారు.