రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఫిబ్రవరి 27న జరగనున్న పోలింగ్

rajya-sabha-elections-schedule-released

న్యూఢిల్లీః రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. 15 రాష్టాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఏపీలో మూడు స్థానాలకు, తెలంగాణలో మూడు, కర్ణాటకలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 10 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో 6 స్థానాల చొప్పున… మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి.