స్విట్జర్లాండ్‌‌లో ‘భోళా శంకర్’ బిజీ బిజీ

మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌‌లో బిజీ బిజీ గా ఉన్నారు. చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో తెరకెక్కుతున్న భోళాశంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నచిరంజీవి..అదే జోష్ తో భోళా శంకర్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ మూవీ వేదాళ‌మ్ రీమేక్‌గా వస్తుంది. ఈ మూవీ లో చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్‌ నటిస్తుండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం స్విట్జర్లాండ్‌‌లో సాంగ్ షూట్ జరుగుతోంది. ‘స్విట్జర్లాండ్‌‌లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్‌‌లో తమన్నాతో సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాట ప్రేక్షకులతో పాటు అభిమానులందరినీ మెప్పిస్తుందని చిత్రీకరణ చుస్తే అర్ధం అవుతుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ మూవీ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.