తెలంగాణ లో ఇంకా స్పీడ్ పెంచాలని చంద్రబాబు పిలుపు

టీడీపీ 41 వ ఆవిర్భావ దినోత్సవ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ , ఏపీ రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు, నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈ వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ..కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలోని తెలంగాణ టీడీపీ టీమ్ బాగా పనిచేస్తున్నారని , వారందర్నిమనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఇంటింటికీ టీడీపీ పార్టీ పేరిట వారు చేపడుతున్న కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోందని కొనియాడారు. రాష్ట్రంలో ఇంకా స్పీడ్ పెంచాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా తప్పకుండా టీడీపీకి పూర్వవైభవం వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీలో శాశ్వత సభ్యత్వం కోసం రూ.5 వేలు రుసుం నిర్ణయించామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీని క్రియాశీలకం చేసేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలను భాగస్వాములను చేసి పార్టీ నడపాలనేది తన సంకల్పం అని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణకు, ఏపీకి వ్యత్యాసం ఉండొచ్చని, కానీ సంకల్పం గొప్పదైతే అందరం పైకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.