వారసత్వ రాజకీయాలు దేశానికి ఎంతో ప్రమాదకరం : ప్రధాని

YouTube video
PM Modi’s reply to Motion of Thanks on President’s address in Rajya Sabha

న్యూఢిల్లీ : రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స‌మాధానం ఇచ్చారు. ఈసందర్బంగా మోడీ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ చేస్తోన్న వారసత్వ రాజకీయాలు దేశానికి ఎంతో ప్రమాదకరమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తేవి కావని, సిక్కుల ఊచకోత లాంటి సంఘటనలు జరిగేవి కావని మోడీ ధ్వజమెత్తారు. అంజయ్య లాంటి సొంత పార్టీ నేతలనే అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకుందని మోడీ ధ్వజమెత్తారు. కాగా జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌ ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) చర్చ జరుగుతోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/