అప్పుడే బాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులుపెట్టిస్తున్నాడు

Chandrababu wrote a letter to UPSC

ఈ నెల 12 న చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందే ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులుపెట్టిస్తున్నాడు. చంద్రబాబు ఆలోచనలు, ఆదేశాలకు అగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం అవ్వకుండా చర్యలు చేపట్టారు.

అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు సాగుతున్నాయి. పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్లు బాగుచేడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలయ్యాయి. ప్రమాణ స్వీకారం తరువాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు సిద్దం అవుతున్నారు. పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ట్రాన్స్ కో, జెన్ కో లలో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధిదీపాలు వెలగని పరిస్థితిని తెలుసుకుని వెంటనే చక్కదిద్దాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం పై దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులకు అస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలా మొత్తం మీద ప్రమాణ స్వీకారానికి ముందే అన్ని సిద్ధం చేసి లైన్లో పెట్టాడు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం ఆలస్యం అభివృద్ధి పనులపై స్పీడ్ పెంచబోతున్నాడు.