షూటింగ్ లో ప్రమాదానికి గురైన నందమూరి బాలకృష్ణ

ఈ మధ్య సినీ యాక్టర్స్ అంత వరుస ప్రమాదాలకు గురి అవుతున్నారు. సాయి ధరమ్ తేజ్ , సిద్దార్థ్ , రామ్ మొదలగు వారు షూటింగ్ లలో గాయపడగా..తాజాగా నందమూరి బాలకృష్ణ షూటింగ్ లో గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ రీసెంట్ గా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

అయితే బాలయ్య..ఆహా ఓటిటి కోసం ఓ టాక్ షో చేయబోతున్నారు. దీనికి సంబదించిన ఫోటో షూట్ అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కాలికి గాయం అయినట్లు సమాచారం. అయితే.. బాలయ్య ఆ గాయాన్ని సైతం లెక్క చేయకుండా.. ఫోటో షూట్‌ పూర్తి చేసేశారట. ఈ విషయాన్ని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. త్వరలోనే ప్రోమో, ఫోటోలోతో కలిపి ఆహా సంస్థ అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు టాక్‌.