తెలంగాణకు తర్వాత సిఎం నేనే కావొచ్చు?

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy
Kishan Reddy

హైదరాబాద్‌: తెలంగాణకు తర్వాత ముఖ్యమంత్రిని తానే కావొచ్చని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలోని బిజెపి శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డి.. 2024లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని, సిఎం అభ్యర్థి ఎవరనేది జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఖనేనే సిఎం కావచ్చుగ లేదా సాధారణ కార్యకర్త అయినా కావచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాను సిఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని.. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని అన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తారని వస్తున్న ఊహాగానాలపైనా ఆయన స్పందించారు. అలాంటి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని స్పష్టం చేశారు. కాగా సిఎం అభ్యర్థిపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. దీన్నిబట్టి 2024లో అధికారమే లక్ష్యంగా బిజెపి పావులు కదిపేందుకు సిద్ధమవుతోందని స్పష్టం అవుతోందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/