ఫుడ్ ప్రియులను ఆకట్టుకుంటున్న ‘సెంట్రల్ జైలు’ రెస్టారెంట్..

ఇటీవల కాలంలో చాలామంది ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సామాన్య ప్రజల నుండి సినీ స్టార్స్ వరకు ఇలా చాలామంది ఫుడ్ బిజినెస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుత బిజీ లీఫ్ లో ఇంట్లో వండుకొని తినే బాదులో హోటల్ ఫుడ్ కు స్ట్రీట్ ఫుడ్ కు బాగా అలవాటుపడుతున్నారు. దీంతో పెద్ద పెద్ద ఐటీ జాబ్స్ చేసేవారు సైతం ఫుడ్ బిజినెస్ లోకి ఎంటరవుతున్నారు. అంతే కాదు రెగ్యులర్ మాదిరికాక కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఫుడ్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.

తాజాగా బెంగళూరులో ఓ వినూత్నమైన రెస్టారెంట్ ఏర్పాటైంది. అదే ‘సెంట్రల్ జైలు’ రెస్టారెంట్. జైలుకు వెళ్లి కావాల్సిన పదార్థాలు తిన్న అనుభూతిని ఈ రెస్టారెంట్ ఇస్తుంది. ఓ సెంట్రల్ జైలు నమూనాలో ఈ రెస్టారెంట్ ను నిర్మించారు. బయట ప్రధాన గేటుపైన సెంట్రల్ జైలు అని రాసి ఉంటుంది. పక్కనే ఓ జైలు వార్డర్ కాపాలాగా ఉన్న బొమ్మ కనిపిస్తుంది. రెస్టారెంట్ లోనికి వెళ్లక వరుసగా గదులు ఏర్పటు చేసారు. వాటికి జైలు ఊచలు కనిపిస్తాయి. కారాగారం లోపల ఉన్న అనుభూతిని కల్పించేందుకు ఇలా సెటప్ చేశారు. జైలర్ డ్రెస్ వేసుకున్న వారు వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ చేసిన వాటిని ఇక్కడ సర్వర్లు ఖైదీల డ్రెస్ వేసుకుని అందిస్తుంటారు. ఇక ఈ రెస్టారెంట్ బెంగుళూర్ లోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ 27వ మెయిన్ రోడ్డులో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.